వర్షాకాలం వచ్చేసింది. వరుణుడి పలకరింపుతో.. సూర్యుడి భగభగల నుంచి ఉపశమనం లభించింది. వర్షాలు పడితే అందరికీ ఆనందమే కానీ.. వాటితో పాటు అనారోగ్యాలను తీసుకొస్తాయి. ఈ కాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇది బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్, దోమలు వృద్ధి చెందడానికి అనువైన కాలం. ఈ కాలంలో ఇమ్యూనిటీ కూడా కొంత బలహీనపడుతుంది, దీంతో అనారోగ్యాలు ఎక్కువగా దాడి చేస్తూ ఉంటాయి. వర్షాకాలంలో వచ్చే అనారోగ్యాలకు తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, విరేచనాలు, చర్మ సమస్యలు వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీటిని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే.. ప్రాణాంతకం కావచ్చు. ఈ సీజన్లో ఎక్కువగా ఇబ్బందిపెట్టే ఇన్ఫెక్షన్స్, అనారోగ్యాలు ఏమిటో చూద్దాం.
1. డెంగ్యూ.

ఈ సీజన్లో డెంగీ విజృంభిస్తుంది. . నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్-బోర్న్ డిసీజెస్ కంట్రోల్ ప్రకారం, భారతదేశంలో ప్రతి సంవత్సరం, డెంగీ కారణంగా వందల మంది మరణిస్తున్నారు. 2023లో కనీసం 1,64,103 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. సాధారణంగా పగటిపూట, సాయంత్రం సమయంలో కుట్టే ఆడ ఏడిస్ దోమల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. డెంగీ తీవ్రంగా ఉన్నవారికి శ్వాస సరిగ్గా ఆడదు, ప్లేట్లెట్ కౌంట్ గణనీయంగా తగ్గుతుంది. సకాలంలో దీనికి చికిత్స తీసుకోకపోతే.. ప్రాణాంతకం కావచ్చు.సాధారణంగా డెంగీ లక్షణాలు మొదటి రెండు నుండి ఏడు రోజుల వరకు కనిపిస్తాయి.
లక్షణాలు:
- తీవ్రమైన జ్వరం
- తలనొప్పి
- కండరాల నొప్పి మరియు జాయింట్ల నొప్పి
- చర్మంపై ఎర్ర చుక్కలు (రాష్)
నివారణ:
- దోమల నివారణ చర్యలు తీసుకోండి.
- నీటిని నిల్వ చేయకుండా చూసుకోండి.
- సంపూర్ణ విశ్రాంతి మరియు మెడికల్ సలహాలను పాటించండి.
2. మలేరియా.

మలేరియా అనాఫిలిస్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. కుట్టిన దోమలు ప్లాస్మోడియం పరాన్నజీవిని ఉంటే మలేరియా వస్తుంది. సకాలంలో చికిత్స తీసుకోకపోతే.. సెరిబ్రల్ మలేరియాకు కారణమవుతుంది, ఇది ప్రాణాంతక పరిస్థితి. మూర్ఛలు, మూత్రపిండాల వైఫల్యం, కామెర్లు, శ్వాసకోశ రుగ్మతలకు దారి తీస్తుంది.
లక్షణాలు:
- అధిక జ్వరం
- చల్లదనం మరియు చెమటలు
- తలనొప్పి
- కీళ్ల నొప్పి, కండరాల నొప్పి,
- గ్రంథుల వాపు
- శరీరం నీరసించడం
- గొంతు మంట
నివారణ:
- దోమల నివారణ చర్యలు తీసుకోండి.
- మలేరియా నిర్ధారణ పరీక్షలు చేయించుకోండి.
- డాక్టర్ సూచించిన మందులు వేసుకోవాలి.
3. టైఫాయిడ్.

మురికివాడల్లో, చెత్త నిండిన నివాస ప్రాంతాల్లో టైఫాయిడ్ జ్వరాలు ఎక్కువగా ఉంటాయి. సాల్మనెల్లా ఎంటెరికా సెరోవార్ టైఫి (ఎస్.టైఫి) బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్ సంక్రమిస్తుంది.
లక్షణాలు:
- జ్వరం: స్థిరంగా మరియు ఎక్కువగా 102°F (38.8°C) లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత.
- వాంతులు: వాంతులు మరియు వికారం.
- పొట్ట నొప్పి: పొట్టలో తీవ్రమైన నొప్పి.
- డీహైడ్రేషన్: దాహం మరియు తలనొప్పి.
- చర్మం రంగు మార్పు: చర్మం పసుపు రంగులో మారుతుంది (జాండిస్).
నిర్ధారణ:
- రక్తపరీక్ష: రక్తనమూనాలు పరీక్షించడం ద్వారా బ్యాక్టీరియా నిర్ధారించబడుతుంది.
- స్టూల్ మరియు యూరిన్ టెస్ట్: స్టూల్ మరియు మూత్రం నమూనాలు కూడా పరీక్షించబడతాయి.
- విడాల్ టెస్ట్: ఇది టైఫాయిడ్ నిర్ధారణకు ఉపయోగించే ఒక ప్రత్యేక పరీక్ష.
చికిత్స:
- యాంటీబయోటిక్స్: బ్యాక్టీరియాను చంపడానికి యాంటీబయోటిక్స్ ప్రస్తుతిస్తారు. ఉదా: సిప్రోఫ్లాక్ససిన్, ఆజిత్రోమైసిన్.
- హెద్రేషన్ : శరీరంలో తేమను నిలుపుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇంట్రావెనస్ ద్రావణాలు అవసరమైనప్పుడు teeతీసుకోవాలి.
- సమయానికి విశ్రాంతి: పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం.
- పౌష్టిక ఆహారం: పౌష్టిక ఆహారం తీసుకోవడం ద్వారా రోగి శక్తిని తిరిగి పొందడం.
నివారణ:
- వ్యాక్సిన్: టైఫాయిడ్ వ్యాక్సిన్లు కొన్ని సమయానికి ముందు ఇవ్వవచ్చు, ముఖ్యంగా ఎక్కువ రిస్క్ ఉన్న ప్రాంతాలకు ప్రయాణించే ముందు.
- శుభ్రతా చర్యలు: శుభ్రమైన నీరు తాగడం, సురక్షిత ఆహారం తీసుకోవడం.
- వ్యక్తిగత పరిశుభ్రత: సబ్బుతో చేతులు కడుక్కోవడం.
- ప్రత్యేక జాగ్రత్తలు: అధిక రిస్క్ ప్రాంతాల్లో అనుమానాస్పద ఆహారం, నీటిని తీసుకోకుండా ఉండటం.
4. చికుంగునియా

చికుంగునియా అనేది ఒక వైరల్ వ్యాధి, ఇది ముఖ్యంగా ఏడిస్ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది తీవ్రమైన కీళ్ల నొప్పులతో గుర్తించబడుతుంది.
లక్షణాలు:
- తీవ్రమైన కీళ్ల నొప్పులు
- జ్వరం
- చర్మంపై ఎర్ర చుక్కలు
నివారణ:
- దోమల నివారణ చర్యలు తీసుకోండి.
- సంపూర్ణ విశ్రాంతి తీసుకోండి.
- నీటిని శుభ్రంగా ఉంచుకోండి.
5. హేపటైటిస్ A

హేపటైటిస్ A అనేది ఒక వైరల్ లివర్ ఇన్ఫెక్షన్, ఇది ముఖ్యంగా కలుషిత ఆహారం మరియు నీటివల్ల వ్యాప్తి చెందుతుంది.
లక్షణాలు:
- జండిస్ (చర్మం మరియు కళ్ళ పసుపు)
- వికారం
- పొట్ట నొప్పి
- అలసట
నివారణ:
- శుభ్రమైన ఆహారం మరియు నీరు మాత్రమే తీసుకోవాలి.
- హేపటైటిస్ A వ్యాక్సిన్ తీసుకోవాలి.
- సానిటేషన్ మెరుగుపరుచుకోవాలి.
వానాకాలం ప్రతి ఒక్కరు తీసుకోవలిసిన జాగ్రత్తలు:
- వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి: శుభ్రత అనేది వ్యాధుల నివారణలో కీలక పాత్ర పోషిస్తుంది. మీ చేతులను తరచు శుభ్రం చేసుకోండి, ముఖ్యంగా ఆహారం తినేటప్పుడు, వంటసమయంలో మరియు బయట నుండి వచ్చినప్పుడు.
- బయట ఆహారం తినోద్దు: స్ట్రీట్ ఫుడ్ తినడం వల్ల ఆహారం ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. స్వచ్ఛమైన, ఫిల్టర్ చేసిన, కాచి చల్లార్చిన నీరు త్రాగాలి.
- మలినాలను నివారించండి: మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి. నీరు నిల్వలు లేకుండా చూసుకోవాలి, ఇది దోమల పెరుగుదలకు ప్రధాన కారణం.
- పోషకాహారం తీసుకోండి: మీ రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీని మెరుగుపరుచుకోవచ్చు. విటమిన్ సి, విటమిన్ డి, జింక్, మరియు ఇతర పోషకాలతో కూడిన ఆహారాలు తీసుకోవాలి.
- దోమల నివారణ: దోమల నివారణ మందులు వాడండి. దోమల నుండి రక్షణ పొందడానికి నెట్స్, రిపెల్లెంట్స్ వాడండి. రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు దోమల నుండి రక్షణ కోసం దోమ గుడారాలను ఉపయోగించండి.
- జనసాంద్రత ఉన్న ప్రదేశాలకు వెళ్లినప్పుడు జాగ్రత్తలు పాటించండి: మాస్క్లు ధరిస్తూ, వ్యక్తిగత దూరం పాటిస్తూ, తుమ్ములు, దగ్గు వచ్చినప్పుడు నోటికి చేయి అడ్డుపెట్టడం వంటి చర్యలు తీసుకోవాలి.
గమనిక: ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం.